Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శక్రవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గహాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాలుగు నెలలుగా మెస్ బిల్లులు రావడం లేదని పేర్కొన్నారు. దాంతో నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదని తెలిపారు. తక్షణమే చొరవ తీసుకొని సకాలంలో బకాయిలు విడుదల చేయాలని కోరారు. లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సుకుమార్, యువరాజ్, రావణ్ పాల్గొన్నారు.