Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగా హన పెంచుకోవాలని కీసర సీఐ రఘువీర్ రెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధి లోని రాంపల్లి ఆర్ఎల్నగర్లో డిసెంబర్ 31 సందర్భంగా ఆశయం సేవా సంస్థ ఫౌండర్, ఓయూ కాలనీ ప్రధాన కార్యదర్శి మల్లేశం, చైర్మెన్ కిరణ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత గురించి అవగాహనా సదస్సు నేపథ్యంలో ఆర్ఎల్నగర్ నుంచి ఆర్టీసీ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు వాహనదారులను ఉద్దేశిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, ప్రతి ఒక్కరూ హెల్మెట్లు వాడుతూ ప్రాణాలను కాపాడుకోవా లనీ, అతివేగం వద్దు ప్రాణాలు ముద్దు అంటూ ఆశయం సేవా సంస్థ ఫౌండర్ సభ్యులు, ఓయు కాలనీ వాసులతో కలిసి సీఐ రఘువీర్ రెడ్డి ప్లకార్డులను ప్రదర్శిస్తూ వాహనదారులను ఆకట్టుకున్నారు. డిసెంబర్ 31 వేడుకల్లో భాగంగా వాహనదారులు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలన్నారు. ఆశయం సేవా సంస్థ ఫౌండర్ సభ్యులు మల్లేశం, కిరణ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల వాహనదారుల్లో మార్పు రావడంతో కనీసం ఒక్క ప్రాణమైనా కాపాడగలిగిన వారం అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ బండారు మల్లేష్ యాదవ్, ఎస్ఐ రామ సూర్యం, మాజీ జెడ్పీటీసీ మునుగంటి సురేష్, ఓ యూ కాలనీ అధ్యక్షులు రాంరెడ్డి, రమేష్, హరి, సంతోష్, హుస్సేన్ రావు, మహేష్, నాగరాజు, నాగేశ్వర రావు, శ్రీనివాస్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.