Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట :అడుగడునా అంధకారం రాజ్యమేలుతున్న నాటిరోజుల్లో క్రాంతి కిరణాల వలే ఉదయించిన సూర్యులు ఫూలే దంపతులు అని ఐద్వా జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ అన్నారు.సావిత్రిబాయిఫూలే జయంతిని సోమవారం జిల్లాకేంద్రంలోని కుమ్మరిబజార్లో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీలకు, దళిత,బహుజనులకు సమాన అవకాశాలు నిరాకరించబడిన ఆ రోజుల్లో ఆ వర్గాల అభివద్ధి కోసం తన భర్త అడుగుజాడల్లో నడిచి ఉద్యమించిన తొలిమహిళా విప్లవకారిణి సావిత్రిబాయిఫూలే అన్నారు.మహిళల విద్య కోసం ఆశ్రమ పాఠశాలను స్థాపించిన భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా నిలిచిందన్నారు.సనాతనవాదులు ఎన్ని అడ్డంకులు సష్టించినా మొక్కవోనిధైర్యంతో మహిళాభివద్ధికి ఆమె ఎంతో కషి చేసిన ధీశాలి అన్నారు.తన జీవితం అంతా అభాగ్యుల సేవలోనే గడిపిన ఆమె ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధికి గురై ప్రాణాలు కోల్పోయిన త్యాగశీలి సావిత్రిబాయి పూలే అన్నారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల జ్యోతి నాయకులు లక్ష్మీ, వెంకటమ్మ, జ్యోతి, సజన, కవిత,నీలిమ పాల్గొన్నారు.