Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
నేటి తరానికి సావిత్రీబాయి పూలే ఆదర్శమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం సావిత్రీబాయి జయంతిని మండల పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ నార్కట్‌పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయిలని సన్మానించారు. నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే మహిళలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ముఖ్య జిల్లా కోశాధికారి నర్ర శేఖర్‌రెడ్డి , జిల్లా కార్యదర్శి ఈ.జయలక్ష్మి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు ఎస్. భానుప్రఖాష్, డి.విజయపాల్, మండల కోశాధికారి కె.వెంకన్న, మండల ఉపాధ్యక్షులు ఎస్. పద్మ , జి.ఆదినారాయణ, జెడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డి గూడెం ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, ఆ సంఘం బాధ్యులు ఎంసురేష్, ఎల్లారెడ్డి గూడెం గ్రామ సర్పంచ్ పుష్ప లత పాల్గొన్నారు.