Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రా మాల అభివద్ధి లక్ష్యంగా సౌకర్యాల కల్పనకు కషి చేస్తున్నట్టు జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అ న్నారు. సోమవారం మండల పరిధిలోని నక్కలపల్లి నుంచి తొండ్లాయి వయా సబ్బిడిగూడెం వరకు డీఎంఎఫటీ నిధులు రూ. కోటి 55 లక్షలతో రోడ్డు పనులకు శంకుస్థానన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సూదిరెడ్డి నరెందర్రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి గౌడ్, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికా ర్జున్రెడ్డి, నక్కలపల్లి సర్పంచ్ ఈద మాదవి నర్సింహ, తొండ్లాయి సర్పంచ్ బింగి కొండయ్య, షాపల్లి గ్రామ సర్పంచ్ కర్ణాటి ఉపేందర్, చిన్నతుమ్మల గూడెం స ర్పంచ్ దాసరి రాజు, ఎంపీటీసీలు కనుకు అంజయ్య, చింత దేవకమ్మ, చింత సుధాకర్, చింత ప్రమీల, బా శపాక స్వామి, సైదులు, భాషపాక రవి , పంచా యతీ రాజ్ ఈఈ తిరుపతయ్య, పంచాయతీ రాజ్ డీఈ విష్ణు, పంచాయతీరాజ్ ఏఈమోహన్, టీఆర్ఎస్ యువజన నాయకులు పుల్లెంల వెంకట్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.