Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ గెజిటడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, ఎంపీడీఓల సంఘం, ఎంపీఓల సంఘం, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం, పంచాయతీ రాజ్ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కె.వీర బ్రహ్మచారి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ , గెజిటడ్ అధికారులు సంఘం జిల్లా అధ్యక్షులు డి.ముజిబుద్దిన్, శ్రవణ్ కుమార్, జె.బాలరాజురెడ్డి, కార్యదర్శి యాకుబ్ నాయక్ , ఎంపీఓల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వేజ్ , పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏపాల సత్యనారాయణ రెడ్డి , జిల్లా అధ్యక్షులు కొప్పు రాంబాబు , పంచాయతీ రాజ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సోమేశ్ పాల్గొన్నారు.