Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సూర్యాపేటలో నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించి మంత్రి జగదీష్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
నాటికి,నేటికి,ఎన్నటికీ ప్రశ్నించే గొంతుకగా పేరున్న పత్రిక నవతెలంగాణ దిన పత్రికనే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నవ తెలంగాణ దినపత్రిక-2022 సంవత్సరపు నూతన క్యాలండర్‌ను ఆవిష్కరించి మాట్లా డారు.ప్రజా పోరాటాల్లో ముందుండి కథనాలను అందించే పత్రికగా అభి వర్ణించారు.ఏ పత్రికకైనా ప్రజలకు, ప్రభుత్వానికి నిత్యం వారదిల పని చేయడం సహజమని,ప్రజా సంబంధాలతో ముడిపడి ఉన్న కథనాలు ప్రచురితమైనప్పుడే పత్రిక మనుగడ సాధ్యమౌతుందని వ్యాఖ్యానించారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, డీసీఎంఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్ వట్టెజానయ్యయాదవ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్,పత్రిక జర్నలిస్టులు ఊట్కూరి రవీందర్,మండల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి,రామారావు, సైదులు,టీఆర్‌ఎస్‌రాష్ట్ర నాయకులు వైవీ, ఉప్పలఆనంద్,మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్ భరత్‌మహాజన్, నాయకులు బత్తుల రమేష్, కీసర వేణుగోపాల్‌రెడ్డి,షేక్ రఫీ, బత్తులప్రసాద్, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, రమాకిరణ్, లింగపల్లి శ్రీనివాస్, క్రాంతి పాల్గొన్నారు.