Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దవూర :మండలంలోని కుంకుడు చెట్టు సర్పంచ్ రమావత్ ప్రియాంక తండ్రి చందు ఎమ్మెల్యేపై చేసిన అసత్య ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జటావత్ రవి నాయక్ అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో జరిగిన సర్పంచ్ల సమావేశంలో మాట్లా డారు. మండలంలో 24 పంచాయతీల సర్పంచ్లు టీ ఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని, ఇంతవరకు ఎవరినీ వేధించలేదన్నారు. ఆదివారం రోడ్డుపై పడుకొని నిరసన తెలపటం సరికాదన్నారు. ఇప్పటి వరకు రూ.70లక్షలు గ్రామ అభివద్ధి పనులకు వినిగించారని, ఇంకా 4 లక్షలకు మాత్రమే ఎంబీలు చేసేది ఉందని చెప్పారు. ఇకపై ఆరోపణలు చేస్తే వూరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో మెండేసైదులు, సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, రమావత్చీనా ఉన్నారు.