Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
మద్యం అధికధరలకు విక్రయిస్తున్న మండలకేంద్రంలోని పుల్లారెడ్డి వైన్స్దుకాణాన్ని మూడు రోజుల కింద సీజ్ చేశామని ఏక్సైజ్ సీఐ తిరుపతిరెడ్డి సోమవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 30న రాత్రి వైన్షాప్ను అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించగా మధ్యం అధికధరలకు విక్రయిస్తున్నట్టు వెల్లడైందన్నారు.దీంతో గత నెల 31న వైన్స్షాప్ యజమానికి ప్రభుత్వరూల్స్ ప్రకారం రూ.2లక్షల ఫైన్ వేసి నోటీస్ జారీ చేసి సీజ్ చేశామన్నారు.ఉన్నతాధికారుల సూచన మేరకు ఫైన్ పెరగవచ్చని లేదా అదే ఫైన్ ఉండొచ్చన్నారు.మద్యం అధికధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.