Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అజెడ్పీ చైర్పర్సన్ దీపికా యుగంధర్‌రావు
నవతెలంగాణ-తుంగతుర్తి
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు పేదంటి ఆడపిల్లలకు వరం లాంటివని జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు అన్నారు.సోమవారం మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాల యంలో 83 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ ఐదుగురు లబ్దిదారులకు షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు.ఆడపిల్లలకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు వరంలాంటివన్నారు.ఉన్నతలక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం నిర్విరామంగా కొనసాగడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్ర మంలో ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, టీఆర్ఎస్ మండలఅధ్యక్షులు తాటికొండ సీతయ్య, మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, సర్పంచులు చందావెంకన్న, గుగులోత్ వెంకన్న, గుగులోత్ ఈరోజి, మిరియాల అనిత జనార్దన్, మామిడి వెంకన్న,ఎంపీటీసీ కేతిరెడ్డి లతావిజరు కుమార్‌రెడ్డి, మట్టపల్లి కవితకుమార్, తహసీల్దార్ రామ్ ప్రసాద్, ఎంపీడీవో ఉపేందర్‌రెడ్డి,రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మహమూద్‌అలీ, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.