Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వరుణ్‌రావు హెచ్చరించారు.సోమవారం మండలకేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీవో 317 సవరించాలని డిమాండ్ చేశారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకోవడం, ఆయనపై పోలీసులు దాడిచేసి జైలులో పెట్టడం కేసీఆర్ రాక్షసపాలనను తలపిస్తుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోతాననే భయంతోనే ఉద్యోగులను తమవైపు తిప్పుకోవడం కోసం బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పేర్వాల లక్ష్మణ్‌రావు, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షులు ధరావత్ శ్రీనివాస్‌నాయక్, మండల ప్రధానకార్యదర్శులు జంపాల వెంకటేశ్వర్లు, బిట్టు నాగరాజు, ధరావత్ రవి, భానోత్ చిట్టిబాబు, కాసుల వీరస్వామి, సతీష్, మాధవరపు అనిల్, రాకేష్రావు,కుంచం లక్ష్మణ్, ధరావత్ కృష్ణ, చేనోంజ్ వెంకటాచారి, దేవయ్య పాల్గొన్నారు.