Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
జీఓ 317ను సవరించి స్థానికత ప్రాతి పదికన సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీనియార్టీతో పాటు స్థానికతను పరిగణలోకి తీసుకొని నూతన సవరణ ఆధారంగా ఉద్యోగుల, ఉపాధ్యాయుల విభజన చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం మండలకేంద్రంలో విధులు ముగించుకున్న అనంతరం నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సవరణలతో కూడిన జీవో విడుదల చేయాలని కేవలం సీనియార్టీ ప్రకారం పరిగణలోకి తీసుకోవడం ద్వారా స్థానిక జిల్లాలను వదిలి ఇతర జిల్లాలకు వలసెళ్లి పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సోంబాబు, జిల్లా కార్యదర్శి వెలుగు రమేష్,మండల అధ్యక్షులు గౌడిచర్ల నరేష్, ప్రధానకార్యదర్శి నోముల భగత్,డీటీఎఫ్ మండలఅధ్యక్షులు ఉమర్, ప్రధానకార్యదర్శి నరేష్, రవీందర్, ఎల్లయ్య,సోమయ్య, ఉపేందర్, పరమేశ్, మహేష్, రమేష్, శ్రీనివాస్, గణేష్ పాల్గొన్నారు.