Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
సూర్యాపేట శాంతినగర్‌కు చేరువలో మండలకేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు అనిల్, సునీల్, రాజులకు శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో అనిల్, సునీల్‌లకు చిన్నపాటి గాయాలవగా మామిడి రాజు పరిస్థితి విషమంగా ఉంది.దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు తూముల సురేష్‌రావు యువకుల వైద్యఖర్చుల నిమిత్తం రూ.35 వేలు, మాజీ మార్కెట్‌కమిటీ చైర్మన్ భుజంగరావు కుమారుడు తూముల విజరురావు రూ.12వేలు, తెరాస జిల్లా నాయకురాలు గార్లపాటి స్వర్ణ రూ. 5వేల ఆర్థికసాయాన్ని యువకులమిత్రులకు సోమవారం అంద చేశారు. హైదరాబాద్‌లో ఉన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాచేపల్లి భారత్ స్పందించి వెంటనే ఆస్పత్రికి చేరుకొని మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.విషయాన్ని మంత్రి దష్టికి తీసుకెళ్తామని భరోసా కల్పించారు.