Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గసభ్యులుతుమ్మల వీరారెడ్డి, మల్లేశం
నవతెలంగాణ-మిర్యాలగూడ
కరెంటు చార్జీలు పెంచే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వ విరమించుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, డబ్బీకార్ మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచాలని ప్రయత్నాలు చేస్తోందని, దాంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు. ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చే విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రామస్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని, ప్రజలను చైతన్య పరచాలని కోరారు. ఈనెల 22 నుంచి 25వరకు జరిగే సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు వీర్లపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ గౌతమ్ రెడ్డి, శశిధర్ రెడ్డి, వరలక్ష్మి, కొండేటి శ్రీను, దైదా శ్రీను, వినోద్ నాయక్, రాగి రెడ్డి మంగా రడ్డి, బాల సైదులు, పాపా నాయక్ పాల్గొన్నారు.