Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
కాంగ్రెస్సభ్యత్వ నమోదులో నియోజకవర్గం ముందుండాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటివెంకన్న యాదవ్ కోరారు.సోమవారం పట్టణంలోని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ ఆదేశాను సారం నూతనంగా చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదును ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు జరిగే లబ్దిని కూడా వివరించాలన్నారు.రాష్ట్రంలో జరిగే సభ్యత్వ నమోదులో జిల్లాను అగ్రభాగాన ఉంచేలా ప్రతిఒక్కరూ చేయూతనందించాలని కోరారు.నియోజకవర్గానికి ఇచ్చిన టార్గెట్‌ను సకాలంలో పూర్తి చేసేలా చొరవ చూపాలన్నారు.ఈ సమావేశంలో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ కోఆర్డినేటర్లు ప్రేమ్‌లాల్, నగేష్ముదిరా, నాయకులు సాములశివారెడ్డి, ఎరగాని నాగన్నగౌడ్, అరుణ్కుమార్దేశముఖ్, దొంగరి వెంకటేశ్వర్లు, భూక్యా మంజీనాయక్, నవీన్‌నాయక్,ఒంటిపులి శ్రీనివాస్ పాల్గొన్నారు.