Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మంచినీటి చేపల పెంపకం చేస్తున్న రైతులు సమగ్ర చేపల పెంపకం విధానాలను పాటించడం ద్వారా తక్కువఖర్చుతో అధికలాభాలను పొందొచ్చని కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్,హెడ్ బి.లవకుమార్ అన్నారు. సోమవారం కేవీకే గడ్డిపల్లిలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔత్సాహికయువతకు జాతీయ మత్య్స అభివద్ధి మండలి, సెంటర్ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్పబ్లిక్ సిస్టమ్ వారి ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణలో భాగంగా సమగ్ర చేపల పెంపకం పద్ధతులపై అవగాహనా కల్పించా మన్నారు.వ్యవసాయ, ఉద్యాన, పశుపోషణ మొదలగు ఇతరపంటలను చేపల పెంపకంతో అనుసంధానం చేయడాన్ని సమగ్ర లేదా సమీకత చేపల పెంపకం అని అంటారని తెలిపారు.చేపలపెంపకం, ఇతరపంటలను అనుసంధానం చేయడంతో పరిమితభూమి నీటివనరులలో ఏకకాలంలో బహుళ ఆదాయం పొందవచ్చన్నారు.పశుపోషణలో వచ్చే వ్యర్థాలను,విసర్జితాలను చేపల పెంపకంలో వినియోగించుకొని పెంపకంఖర్చును తగ్గించుకోవచ్చన్నారు. రైతులు తమకున్న వనరులను వినియోగించుకొని చేపలు,కోళ్లు, చేపలు బాతులు, పశువులు, చేపలు పందులు, చేపలువరి, చేపలుహార్టికల్చర్ మొదలగు పెంపకాలను చేపట్టి తక్కువ ఖర్చుతో అధికఆదాయాన్ని పొందవచ్చునని తెలిపారు.ఈ శిక్షణలో సుప్రీత, పుష్ప, విమల, లక్ష్మి, శైలజ, గురవయ్య, నరేష్, సైదులు, శ్రీనివాస్, జానకిరాములు, మహేష్, కుమార్, నాగరాజు, రాజకుమార్, మట్టయ్య, ప్రభాకర్, విశ్వనాధం పాల్గొన్నారు.