Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రజా సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ
అ అభివద్ధి పథంలో భువనగిరి నియోజకవర్గం
నవతెలంగాణ -భువనగిరిరూరల్
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజానాయకుడిగా ముద్ర వేసుకున్నారు. పల్లె పర్యవేక్షణ పేరుతో ...గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తూ .. ఎమ్మెల్యే గా కాకుండా, నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా నాయకుడిగా ప్రజలచేత పిలిపించు కుంటున్నాడు.
ప్రజా సమస్యలపై నిరంతర పర్యవేక్షణ
నియోజకవర్గాన్ని మోడల్ నియోజవర్గం గా అభివద్ధి చేసేందుకు పల్లె పర్యవేక్షణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని, ప్రజలతో మమేకమై ప్రజల మధ్యనే సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. పల్లె పర్యవేక్షణ కార్యక్రమంలో భాగంగా స్వయంగా ప్రజా సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని, అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఎక్కడైనా అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
ఫ్లోరైడ్ రహిత నియోజకవర్గంగా వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండగా, భువనగిరి నియోజకవర్గంలో ప్రజలకు ఫ్లోరైడ్ రహిత మంచి నీటిని అందించేందుకు, పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సొంతంగా వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేయించారు. ప్రజలకు మంచినీరు అందించడంలో కషి చేశారు.
పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు
పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నియోజకవర్గంలో విస్తతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహకారం అందజేస్తున్నారు. పైళ్ల ఫౌండేషన్ ద్వారా చనిపోయిన మతుల కుటుంబాలకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబాలను ఆదరించి వారికి తోడ్పాటును అందజేస్తున్నారు. కుటుంబ పెద్ద లేని వారికి తానే పెద్ద దిక్కు సహాయ సహకారాలు అందజేస్తూ , పేద ప్రజలకు మహోపకారం చేస్తున్నారు.జిల్లా కేంద్రంలో అభివద్ధి కోసం బాటలు
భువనగిరి జిల్లా కేంద్రంలో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రూ.2కోట్లా 10 లక్షలతో 116 స్థానాలతో ప్రత్యేకంగా, అన్ని హంగులతోనూ కూడిన మోడల్ రైతు బజార్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
అభివద్ధి పథంలో భువనగిరి జిల్లా కేంద్రం
రూ.8 కోట్లా 16 లక్షలతో సమీకత మార్కెట్ , ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రూ.3 కోట్లతో ఓపెన్ స్టేడియం నిర్మాణం ఏర్పాటుకు ప్రత్యేక కషి చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్ర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి భువనగిరి పెద్ద చెరువును మినీ ట్యాంక్ బాండ్ తీర్చిదిద్దేందుకు కషి చేస్తున్నారు. ఈ పనులను ప్రతిరోజు స్వయంగా పర్యవేక్షిస్తూ భువనగిరి జిల్లా కేంద్ర అభివద్ధికి ప్రత్యేక కషి చేస్తున్నారు.భువనగిరి పట్టణ అభివద్ధి చెందేందుకు రహదారి విస్తరణలో భాగంగా చేపడుతున్న పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
రైతన్నకు అండగా బునాదిగానే కాల్వ నిర్మాణం కోసం కషి
రైతులకు సాగునీరు అందించేందుకు బునాదిగానే కాల్వ నిర్మాణం చేయడంలో, కాల్వను విస్తరించడంలో ఎమ్మెల్యే స్వయంగా తానే అక్కడ ఉండి పనులు చేయించారు. మూసీ నీరు చివరి ఆయకట్టు వరకు వెళ్లేందుకు కషి చేశారు. మూసీ జలాలతో బీడు భూములను సాగు భూములు గా మార్చిన ఘనత పైళ్ల కే దక్కింది.
రూ.50 లక్షల తో ఐసోలేషన్ వార్డులో ఏర్పాటుకు కషి
కరోనా నేపథ్యంలో భువనగిరి నియోజకవర్గ ప్రజలను ఆదుకునేందుకు భువనగిరి ఏరియా ఆస్పత్రిలో, బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో రూ.50 లక్షలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి, నియోజకవర్గ ప్రజల పాలిట ఆరోగ్యదాత గా నిలిచారు.
కరోనాలో ఎమ్మెల్యే కరుణ
పేద ప్రజలు కరోనా కాలంలో పడుతున్న తీవ్ర ఇబ్బందులు గమనించి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మూడు అంబులెన్సులను సొంతంగా కొనుగోలు చేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సొంత డబ్బులతో అంబులెన్స్ ను కొనుగోలు చేసి మంత్రి కేటీఆర్ కు అందజేశారు.