Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూర్: పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) నూతన సంవత్సర క్యాలెండర్ను స్థానిక మార్కండేశ్వర దేవాలయంలో మంగళవారం పద్మశాలి ప్రముకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోపా మునుగోడు నియోజకవర్గం అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ పోపా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, కరోనా సమయంలో పేద పద్మశాలి కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించామని, ఆర్థికంగా వెనుకబడి పై చదువులు చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నామని, నల్గొండ జిల్లా కేంద్రంలో వద్ధాశ్రమం నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పద్మశాలి అభ్యున్నతి కోసం పోపా నిరంతరం కషి చేస్తుందని తెలిపారు. చేనేతపై జీఎస్టీ ని పూర్తిగా రద్దు చేయాలని, చేనేత కార్మికులు చేసే పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, కౌన్సిలర్ చిలుకూరి రాధిక శ్రీనివాస్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కోమటి వీరేశం, కార్యదర్శి జూలూరి ఆంజనేయులు, చేనేత కార్మిక శాఖ అధ్యక్షులు తిరందాసు శ్రీనివాసులు, చేనేత సహకార సంఘం అధ్యక్షులు జూలూరు శ్రీనివాసులు, గంజి యాదగిరి, పోపా సహ అధ్యక్షులు అయిటిపాముల రాజలింగం, కోశాధికారి రాపోలు జగదీశ్వర్, కార్యదర్శులు కోట మల్లేశం, గానుగు శ్రీనివాసులు, కార్య నిర్వక కార్యదర్శి కర్నాటి మధు, ప్రచార కార్యదర్శి ఏలే శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు తిరందాసు నందు, చిటిప్రోలు మహేష్, చిట్టిపోలు పుల్లయ్య, చెరిపెల్లి నాగరాజు, తిరందాసు శివ, ఏలె సత్తయ్య పాల్గొన్నారు.