Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కపాకర్ జన్మదిన వేడుకలు
సూర్యాపేట: రక్తదానం ప్రాణదానంతో సమానమని టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు,కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మెన్ మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కపాకర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లాకేంద్రంలో 45 వార్డులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని, ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణాలు కాపాడాలని సూచించారు.ముఖ్యంగా యువత రక్తదానం చేసేందుకు ముందుకురావాలని కోరారు.కపాకర్ జన్మదినం సందర్భంగా అంతకు ముందు 45వ వార్డులో మున్సిపల్ కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం పంపిణీ చేసి,ఆలేటి ఆటంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాత వ్యవసాయ మార్కెట్లో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో కార్మికులకు గొడుగులు పంపిణీ చేసి,ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.కొత్త బస్టాండ్ వద్ద మాస్కులు,శానిటైజర్లతో పాటు వద్ధులకు రాత్రి దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముషంహరి,తేలుకుంట్ల వెంకటేశ్వర్లు, పాపాన్ని యాదగిరి, దాసరిరమేష్,చిలుకూరు చంద్రశేఖర్,గండూరి సుధీర్,ఈగ దివాకర్, వార్డు అధ్యక్షులు కుక్కడపు సాలయ్య,కుక్కడపు భిక్షం, జంపాల శ్రీను, టీఆర్ఎస్ నాయకులు,పిశిక వీరయ్య జూలకంటి నాగరాజు, దూలం నగేష్ఫణి,రమేష్ శ్రవణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.