Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ :రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా అర్హులైన వితంతువులు, వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్లను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. కనగల్ మండలంలోని చెల్లయ్యగూడెం, కనగల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు పెన్షన్ సహకారం అందించడం కనీస బాధ్యత అని అన్నారు. ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందుల సైదులు, సహాయ కార్యదర్శి కానుగు లింగస్వామి, మండల కమిటీ సభ్యురాలు సుల్తానా, లక్ష్మమ్మ, నాగలక్ష్మి, సైదమ్మ పాల్గొన్నారు.