Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమలగిరిసాగర్ : తిరుమలగిరి మండలాన్ని అభివద్ధి పథంలో తీసుకెళ్తానని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ భగవాన్నాయక్ అధ్యక్షతన ఎంపీటీసీల, సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీకి ఆత్మీయ సన్మానం చేశారు. దీనిలో భాగంగా ఎంపీపీ భగవాన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, స్థానిక నాయకులు వార్డు మెంబర్లు ఎమ్మెల్సీని గజ మాలలతో, శాలువలతో సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తిరుమలగిరి మండలాన్ని ఏర్పాటు చేయడంలో జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి జగదీష్ రెడ్డి బాసటగా నిలిచారు అన్నారు. సుమారు రూ.600 కోట్ల పైగా నిధులతో మండలంలో 25 వేల ఎకరాలు సస్యశ్యామలం అయ్యే విధానంగా నెల్లికల్ లిఫ్ట్ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం పోడుభూముల సమస్యలను పరిష్కరించే విధంగా కషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. మండల కేంద్రం మీదగా దొక్కలబాయి తండా నుంచి ముసలమ్మ చెట్టు వరకు డబుల్ రోడ్డు ఏర్పాటు గురించి సంబంధింత మంత్రుల దష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో మండల ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం స్థలాలను సేకరించి నూతన భవనాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ పాండునాయక్, ఎంపీడీఓ అస్గర్ అలి, జెడ్పీటీసీ సూర్య భాష్య నాయక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పుట్లూరి రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జయరాం నాయక్ , స్థానిక సర్పంచ్ శాగం శ్రావణ్ కుమార్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ శాగం రాఘవ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ రహీం, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ భిక్షానాయక్, మాజీ ఎంపీపీ సలహాదారుడు అల్లి పెద్దిరాజు, రమణ రాజు, పసుపులేటి కృష్ణ, కళమ్మ ప్రమీల, జ్యోతి పాల్గొన్నారు.