Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ : శక్తి లయన్స్ క్లబ్ నల్లగొండ వారి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 15 మంది పాల్గొని రక్తదానం చేశారు. సంద ర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెండ్యాల సరిత మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం అని, కోవిడ్ కారణంగా రక్తనిధి కేంద్రాల్లో రక్తం అందుబాటులో లేక పేదవారు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ, రామలింగం, సరిత కొండల్, కోట సౌజన్య, చిలక రాజు శ్రీనివాస్, కె.కిరణ్ కుమార్, నగేష్ పాల్గొన్నారు.