Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
నాగారం మండలానికి చెందిన మహాత్మాజ్యోతిరావుఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఎలాంటి కారణాలు లేకుండా సస్పెండ్ చేస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడుతూన్న పీఈటీ నరేష్, ప్రిన్సిపాల్ లక్ష్మయ్యలను, విద్యార్థులను టార్గెట్ చేస్తూ విద్యార్థులపై చెయ్యి వేసుకొని సస్పెండ్ చేసిన ఏటీపీ ఝాన్సీరాణిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆ పాఠశాల ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పోలేబోయిన కిరణ్, బీసీ జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య,టీవీవీ జిల్లా అధ్యక్షుడు గుండాల సందీప్, ఆర్వీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్, కేషబోయినవంశీ పాల్గొన్నారు.