Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
చేపల పెంపకం చేస్తున్న రైతులు సున్నాన్ని వాడడం ద్వారా అనేక లాభాలు ఉంటాయని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.లవకుమార్ అన్నారు. మంగళవారం కేవీకే గడ్డిపల్లిలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔత్సాహిక యువతకు జాతీయ మత్య్సఅభివద్ధి మండలి, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం వారి ఆర్థిక సహకారం, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ హైదరాబాద్ వారి సంయుక్తసహకారంతో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణలో భాగంగా చేపల చెరువుల్లో సున్నం వాడకం దానివల్ల కలిగే లాభాల గురించి వివరించారు.చేపల పెంపకంలో నేల ఉదజని సూచిక విలువ ఆధారంగా సున్నం పరిమాణం నిర్ణయించుకొని తప్పనిసరిగా వాడుకోవాలన్నారు.సున్నం అతి చౌకైన, అధికపరిమాణంలో లభ్యమయ్యే రసా యనమని, దీని వాడకం ద్వారా నీటినాణ్యత పెరుగుతుందని వివరించారు.ఈ శిక్షణలో భాగంగా చేపల చెరువులో సున్నం ప్రాక్టి కల్గా చల్లేవిధానం చూపించి శిక్షణా ర్థులకు అవగాహన కల్పించామన్నారు.ఈ కార్యక్ర మంలో లక్ష్మీ, సుప్రీత, పుష్ప, స్రవంతి, హైమావతి, భవాని, శైలజ, ప్రదీప్తోకుమార్, రాంబాబు, రాజకుమార్, మట్టయ్య, గుర్వయ్య, సారథి, జానయ్య, శ్రీనివాస్, విశ్వనాథం, మహేష్ పాల్గొన్నారు.