Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
అన్నదమ్ముల మధ్య ఘర్షణలో తండ్రి మృతి చెందిన సంఘటన మండలపరిధిలోని మంగాపురంతండాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ధరావత్ సైదులు,గోపి ఇరువురి అన్నదమ్ముల మధ్య ట్రాక్టర్ డబ్బులకు సంబంధించి సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పంచాయతీ జరిగింది.ఈ క్రమంలో తండ్రి ధరావత్ లాల్(65) పంచాయతీ వద్దని వారించాడు.ఈ క్రమంలో ఆగ్రహించిన పెద ్దకుమారుడు సైదులు నువ్వు తమ్ముడు గోపి వైపు మాట్లాడుతున్నావని ఆరోపించాడు. అంతటితో ఆగకుండా దగ్గరిలో ఉన్న మంచం పట్టెను తీసుకుని తండ్రిలాల్, తమ్ముడు గోపిలపై దాడి చేశారు.దీంతో ఇద్దరికి గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.తండ్రి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ప్రశాంతి ఆస్పత్రికి తీసుకెళ్లారు.చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు.మృతుని చిన్న కుమారుడు గోపి ఫిర్యాదు మేరకు ఎస్సై కొండల్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.