Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
గ్రామాలు పచ్చదనంతో ఉండాలని, అభివద్ధిపథంలో కొనసాగాలనే ఉద్దేశంతో సిఎం కేసీఆర్ పంచాయితీల్లో పల్లె ప్రకతివనాలు ఏర్పాటు చేశామని ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ పోరెడ్డి శైలజ అన్నారు. మంగళవారం మండలంలోని గడ్డిపల్లి ప్రకతివనాన్ని ఆమె సందర్శించి మాట్లాడారు.ప్రకతివనంలో నాటిన మొక్కలు, రకాలను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రకతి వనాన్ని, నర్సరీని నిర్వహిస్తున్న తీరు బాగుందన్నారు. వాటిని పెంచి పోషిస్తున్న వనసేవకుడు పురుషోత్తంని అభినందించారు.అనంతరం నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. నర్సరీలో ప్రతి బ్యాగ్ కు లెక్క ఉంటుందని గత అనుభవాల ను దష్టిలో ఉంచుకొని స్థానికంగా దొరికే సీడ్‌ను సేకరించి మొక్కలు పెంచుకొంటే సమయం ఆదా అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ లావణ్య, సర్పంచ్ సుందరినాగేశ్వరరావు, ఎంపీటీసీ మేకల స్రవంతిశోభన్, కార్యదర్శులు పాల్గొన్నారు.