Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
ఐసీడీఎస్ ప్రాజెక్టులోని అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాల్లో విలీనం చేయడాన్ని విరమించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఎదుట నల్లగొండ ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆయన సమక్షంలో సీఐటీయూలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14000 అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో రూ. 40 కోట్ల అద్దె భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా ఈ ముప్పు పొంచి ఉందని పేర్కొ న్నారు. సెంటర్లను కొనసాగించాలని, కేంద్రం పెంచిన వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, పెండింగ్ టీఏ, డీఏలను అందించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి కేంద్రం పెంచిన వేతనాలు చెల్లించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యతను సుప్రీంకోర్టు, కాగ్ నివేదిక, యూనిసెఫ్ ల్యాండ్ సర్వే చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహి స్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, భీమగాని గణేష్ , అంగన్వాడీ టీచర్లు మంజుల, విజయలక్ష్మి, జానమ్మ, పర్వీన్ సుల్తానా, మణిరూప, మమత, చంద్రకాంత, శ్రీమతి, రత్న, సరిత, పద్మ, చంద్రకళ రజిత, మల్లీశ్వరి అనిత, శ్రీలక్ష్మి, నవణిత, రేణుక,హేమలత, రాజేశ్వరి, విమల, సునీత, యాదమ్మ ప్రమీల పాల్గొన్నారు.