Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సూర్యాపేట జిల్లా జెడ్పీ సీఈఓ సురేష్
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలో కరోనా కట్టడి మనందరి బాధ్యతని జెడ్పీ సీఈఓ సురేేష్ అన్నారు.మంగళవారం చైర్పర్సన్ సాంఘీక సంక్షేమం,6వ స్థాయీ సంఘ సమావేశం బాణాల కవిత అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సంక్షేమహాస్టల్స్, గురుకుల పాఠశాలలోని 15 నుండి 18 ఏండ్లు గల విద్యార్దిని,విద్యార్ధులకు తప్పకుండా వాక్సినేషన్ వేయించాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల పాఠశాలల నందు అధికారులు, కరోనానేపధ్యంలో పరిశుభ్రత అమలుచేయడంలో ముందుండాలని కోరారు. అనంతరం సూర్యాపేట జెడ్పీటీసీ జీడిభిక్షం మాట్లాడుతూ సంక్షేమపధకాలు అర్హులందరికీ అందించాలని, పాఠశాలలు, కళాశాలలు, గురుకుల పాఠశాలలను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను కోరారు.ఈ సమావేశములో జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు మద్దిరాల కన్నాసూరాంబ, 5వ స్థాయిసంఘం జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.