Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఈ నెల 22 నుండి 25 వరకు జరిగే సీపీఐ(ఎం) రాష్ట్ర మూడవ మహాసభల విజయవంతానికి ప్రజలంతా ఆర్థికంగా సహకరించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని మల్లువెంకట నర్సింహారెడ్డి భవన్లో పార్టీ రాష్ట్రమహాసభలకు సంబం ధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.రాష్ట్ర మహాసభల సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఈ నెల 22న భారీ బహిరంగసభ ఉంటుందన్నారు. బహిరంగసభకు జిల్లావ్యాప్తంగా 5 వేల మందిని సమీకరణ చేయనున్నా మన్నారు.సభకు ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాంఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తదితర అగ్రనేతలు పాల్గొంటున్నట్టు చెప్పారు.ఈ నెల 5 నుండి 21 వరకు జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలలో, పట్టణాలలో ఇంటింటికి సీపీఐ(ఎం) పేరుతో ప్రజల నుండి విరాళాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీకి ప్రజలు ఆర్థికంగా సహాయ, సహకారాలు అందిం చాలని విజ్ఞప్తి చేశారు.ఈ మహాసభలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించనున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, నాయకులు ధీరావత్ రవినాయక్,మట్టిపల్లి సైదులు, కోటగోపి, దండ వెంకట్‌రెడ్డి,వేల్పుల వెంకన్న, చిన్నపంగ నర్సయ్య, మేకనబోయిన సైదమ్మ, కొప్పుల రజిత, నాయకురాలు వెలిదిపద్మ పాల్గొన్నారు.