Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -భువనగిరి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీిఆర్ఎస్ ప్రభుత్వాలు అవలంబిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధంకావాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సుందరయ్య భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల కొండమడుగు నరసింహ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రజల మీద మేయలేని భారాలు వేస్తున్నాయన్నారు. రైతులకు నష్టం చేసిన చట్టాలను తీసుకొచ్చి సంవత్సరం పాటు కాలయాపన చేసి చివరకు వెనుక్కు తగ్గిందన్నారు. ఇది రైతులు సాధించిన విజయమన్నారు. దేశంలో ఎన్నడూలేని విధంగా పెట్రోల్ ,డీజిల్ ధరలు పెంచడంతో సామాన్యులు వాహనం నడిపే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో టీిఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే విధంగా 317 జీవోను తీసుకొచ్చిందన్నారు. వెంటనే జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిద్ధం కావాలని కోరారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని జిల్లా అభివద్ధికి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమా వేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, దోనూరి నర్సిరెడ్డి, రోడ్డ అంజయ్య, మేక అశోక్, దాసరి పాండు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మంగ నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మాయకష్ణ, ఎండి.పాషా, బొల్లి యాదగిరి, సిర్పంగి స్వామి, బొడ్డుపల్లి వెంకటేష్ రెడ్డి, గడ్డం వెంకటేష్, సైదులు ,వెంకట్, శ్రీనివాస్, ఇక్బాల్ పాల్గొన్నారు.