Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్
అ జిల్లాకేంద్రంలో అభివృద్ధి పనుల పరిశీలన
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణ అభివద్ధిలో భాగంగా టౌన్‌హాల్, హెలిప్యాడ్, ఐబీ, ఆర్అండ్, భూగర్భ జలవనరుల శాఖ కార్యాలయాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి , మున్సిపల్ చైర్మెన్ మందడి సైది రెడ్డి, ఆర్అండ్బీ, ఐబీ, రెవెన్యూ, భూ గర్భ జల వనరుల శాఖ,సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి చేపట్టనున్న పనుల ప్రతిపాదనలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి ఆర్అండ్బీ, ఐబీసీ, గ్రౌండ్‌వాటర్, టౌన్‌హాల్ కార్యాల యాలు, మున్సిపల్ భవన సముదాయం,కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న పొట్టి శ్రీ రాములు విశ్వ విద్యాలయం జానపద కళాక్షేత్రంకు కేటాయించిన స్థలాలను పరిశీలించారు. పాత టౌన్ హాల్ వద్ద ఆధునిక వసతులతో,పార్కింగ్ సదుపాయంతో ఇరిగేషన్,ఆర్అండ్బీ, భూ గర్భ జల వనరుల శాఖ కార్యాలయం లు భవన నిర్మాణం కు నిధులు మంజూరుకు ప్రతిపాదనలు వెంటనే పంపాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి,ఆర్అండ్బీ ఎస్ఈ నరసింహ, ఈఈ నరేందర్ రెడ్డి, ఐబీఈఈ సత్యనారాయణ రెడ్డి, సర్వే,ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్, భూగర్భ జలవనరుల శాఖ డీడీ సునీల్ బాబు, తదితరులు ఉన్నారు.