Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తహసీల్దార్ కార్యాలయం ఎదుట
నవతెలంగాణ-నాంపల్లి
మండలకేంద్రంలో 489, 492 సర్వే నంబర్ భూమిలో గతంలో ఇచ్చిన ఇంటి స్థలాలను యధావిధిగా 82 మంది లబ్ధిదారులకు ఇవ్వాలనే రెవెన్యూ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయాలని , 492 సర్వే నంబర్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకొని భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని బాధితులు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దాంతో తహసీల్దార్ చిలుకూరి లాల్‌బహదూర్ బాధితులతో మాట్లాడి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అదే విధంగా కొంతమంది మధ్యవర్తులు నకిలీ ఆజ్ఞ, పొజిషన్ పత్రాలు ఇచ్చి కొందరు లబ్ధిదారుల నుంచి ముప్పై నుంచి డెబ్భై వేల రూపాయల వరకు వసూలు చేసి మోసం చేశారని, వారిపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యకమ్రంలో వట్టికోటి సైదులు, అలంపల్లి కిరణ్, మహ్మద్ హమీద్, కామిశెట్టి బుచ్చమ్మ, సోమ సత్యవతి, కోనేటి అంజయ్య, నాంపల్లి కొండయ్య, గౌరు కిరణ్ కుమార్, బిరుడొజు నాగాచారి, పూల వెంకటమ్మ, జినుకల గిరి, కామనబోయి చిన్న కృష్ణయ్య, దాచేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.