Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) క్యాలెండర్ను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, జెడ్పీటీసీ బాలు, పున్న వెంకటేశ్వర్లు, ఎంఈఓ మాతృనాయక్, పీఆర్టీయూ నాయకులు చందర్, కిరణ్,దామోదర్, లోక్య పాల్గొన్నారు.