Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్ట కిశోర్
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సహకారంతో పట్టణానికి కొత్తహంగులు వస్తున్నాయని మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్టకిశోర్ అన్నారు.గురువారం ఆయన కమిషనర్ రామాంజులరెడ్డి, ఈఈ ప్రసాద్‌తో కలిసి 22వ వార్డులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యం చేసిన పట్టణంలోని పాత ప్రాంతంపై మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక దష్టిసారించారన్నారు.ఇప్పటికే మంత్రి సహకారంతో 22 వార్డులో సీసీరోడ్లు, డ్రయినేజీలు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానవాటిక, వీధిలైట్లు లాంటి అభివృద్ధి పనులు జరిగాయన్నారు.వార్డులో త్వరలో జరిగే కార్యక్రమాల సందర్భంగా వార్డు ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలికాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు గోనెఅశోక్,నాయకులు సిగసత్యం, పరెడ్డి ఉపేందర్,అయ్యన్న, మోరఉదరు, వేణు, విజరు, రవి పాల్గొన్నారు.