Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాంగ్రెస్ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు తండు శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ-సూర్యాపేట
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్ బీసీ సామాజిక వర్గానికే కేటాయించాలని కాంగ్రెస్ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తండు శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు.గురువారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.1982 నుండి తాను కాంగ్రెస్‌లో అనేక హోదాల్లో పనిచేశా నన్నారు.సూర్యాపేట పట్టణ అధ్యక్షులుగా, మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా, సింగిల్ విండో చైర్మెన్‌గా, డీసీసీబీ డైరెక్టర్‌గా, మున్సిపల్ కౌన్సిలర్, యూత్ కాంగ్రెస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ 2024 ఎన్నికలలో సూర్యాపేట ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని కోరారు.ఈ సంధర్భంగా రెండవసారి ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఆయన్ను పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు,పార్టీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బెంజారపు రమేష్,జిల్లా ఉపాధ్యక్షులు సైదులు, సేవాదల్ జిల్లా చైర్మెన్ సరస్వతి భట్ల అన్నపూర్ణ,యూత్ నాయకులు తండు రామకష్ణ,మామిడి సూర్య ప్రకాశ్,తండు శ్రావణ్,నిద్ర సంపత్ నాయుడు,పేర్ల యాదగిరి,పోలేబొయిన లింగరాజు, కె.శ్రీనివాస్, కె.రవి,గాజుల లక్ష్మీ,సువర్ణ తదితరులు పాల్గొన్నారు.