Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 317 ఉద్యోగుల్లో తీవ్రమైన అశాంతిని,ఇబ్బందిని కలుగజేస్తుందని ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 317ను వెంటనే రద్దు చేయాలని సీపీఐఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన జీవో కు ముందు ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో కనీస సంప్రదింపులు చేయకుండా బదిలీలకు సంబంధించి కనీస పద్ధతులను నియమాలను పాటించకుండా హడావుడిగా జీవో 317 అప్రజాస్వామికంగా తీసుకొచ్చిందని విమర్శించారు.ఇప్పటికే తన అక్రమ బదిలీ సమాచారాన్ని విని తట్టుకోలేక ఒక ప్రధానో పాధ్యాయుడు అక్కడికక్కడే చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.అనేక మంది తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని.ప్రభుత్వం తెచ్చిన ఈ జీవోను వెంటనే ఎత్తివేయాలని చేశారు.భార్యభర్తలు ఒకే దగ్గర పోస్టింగులు ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు.ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో, రాజకీయపార్టీలతో చర్చించి బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.