Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యం ఇస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.గురువారం మండలపరిధిలోని సిరికొండ,తుమ్మగూడెం గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రానికి భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వైద్యాన్ని మెరుగు పరచడం కోసం తమ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు పెడుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆయురారోగ్యాలు దష్టిలో ఉంచుకుని వైద్యశాలలా స్థాపనకు కషి చేస్తుం దన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నూకల సావిత్రమ్మ, ఎంపీటీసీలఫోరం మండలఅధ్యక్షులు కంపాటి వెంకన్న,టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శీలం సైదులు, సిరికొండ పీఏసీఎస్ చైర్మెన్ కొండపల్లి వెంకటరెడ్డి, సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షులు పొనుగోటి నర్సింహారావు, నూకల మధుసూదన్‌రెడ్డి, బ్యాంకు డైరెక్టర్ మందడి శివరంజనిరెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి మద్ది మధుసూదన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కారింగుల శ్రీనివాస్, సర్పంచులు గాంధీ, ఉమావెంకన్న, రమేష్, మండలఉపాధ్యక్షులు దేవ్లా, నగేష్, వైద్యాధికారులు నాజియా, సనా, సూపర్వైజరు కమలమ్మ, సైదులు పాల్గొన్నారు.