Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా షెడ్యూల్ కులాల అభివద్ధి అధికారి జైపాల్ రెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్, భారతరత్న అంబేద్కర్ ప్రపంచానికే మార్గదర్శి అని జిల్లా షెడ్యూల్ కులాల అభివద్ధి అధికారి జైపాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ అన్నారు. శుక్రవారం యాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కాలేజీ గర్ల్స్ హాస్టల్లో నిర్వహించిన కార్యక్రమంలో వంద మంది విద్యార్థినులకు అంబేద్కర్ జీవిత విశేషాలతో ముద్రించిన పుస్తకాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలమంత సామాజిక అసమానతలపై అలుపెరుగని పోరాటం చేశారన్నారు. యాత్ర సంస్థ డైరెక్టర్ సురుపంగ శివలింగం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అసిస్టెంట్ అధికారి శైలజ, వార్డెన్ చంద్రకళ ,తదితరులు పాల్గొన్నారు.