Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1978-79 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు శుక్రవారం ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ సూరజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు అంకితభావంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు పాఠశాలకు బీరువా బహూకరించారు. ప్రతి సంవత్సరం పదో తరగతి ఇంగ్లీషు మీడియంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థికి రూ.5వేల నగదు, 9వ తరగతి విద్యార్థికి రూ.3వేల నగదు అందజేయనున్నట్టు పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సామిడి రాఘవరెడ్డి, బడుగు శ్రీరాములు, కర్నాటి సత్యనారాయణ, కల్లెం అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, చింతల కరుణాకర్‌రెడ్డి, బొబ్బిళ్ల వెంకటేశ్‌కుమార్, సీహెచ్.విజరుకుమార్, గట్టు రఘురాములు, నర్సింహా, దశరథ, యాదగిరిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.