Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
ఆశావర్కర్లు చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం 11వపీఆర్సీ ప్రకారం 30 శాతం వేతనాలు పెంచుతూ జీవో నెంబర్1ని విడుదల చేసినందరి సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ఆశావర్కర్లు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కేక్కట్చేసి స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు మూడేండ్లుగా చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం పీఆర్సీ జీవోను విడుదల చేసిందన్నారు. ఆశాలకు పారితోషకం కాకుండా కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా ఉపాద్యక్షురాలు రంగ సంతోష, కోశాధికారి పుష్పా, యూనియన్ నాయకురాలు కల్పన, అలివేల, అరుణ, జానకి, లింగ లక్ష్మీ, పద్మ, హైమవతి, మల్లీశ్వరి ,లూథియా పాల్గొన్నారు.
కార్మికుల పోరాట ఫలితమే 30 శాతం పెంపు
మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం 30 శాతం పీఆర్సీని పెంచిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు అన్నారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో భువనగిరి వినాయక చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 62 జీవోను అమలు చేసి కేటగిరీల వారీగా వేతనాల పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మాయ కష్ణ, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ జిల్లా అధ్యక్షులు ఓదరి రామచందర్, నాయకులు కొండయ్య రాములు, శాంతమ్మ, యాదమ్మ, భారతమ్మ, రేణుక కుమారి, లక్ష్మి పాల్గొన్నారు.