Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
క్రీడల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని రంగారెడ్డి జిల్లా హాకీ క్రీడ అధ్యక్షులు పాండురంగారెడ్డి అన్నారు. పాలకుర్ల శివయ్యగౌడ్ స్మారక ఫౌండేషన్ చైర్మెన్ పాలకుర్ల మురళిగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలకు హాకీ స్టిక్స్ పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోరారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడాపోటీల విజేతలకు బహుమతులు ప్రదానంచేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.భవానీ, సాయిరెడ్డి పాల్గొన్నారు.