Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
స్థానిక గీత విద్యాలయంలో శుక్రవారం సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. భోగిమంటలు, గంగిరెద్దులు సప్తవర్ణ శోభితమైన రంగవల్లులు ,చిన్నారి విద్యార్థుల పతంగులు, చూపరులను కన్నుల పండుగను చేశాయి. విద్యార్థులు వేసిన నత్యాలు పలువుర్ని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, కరస్పాండెంట్ పోలోజు నరసింహ చారి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నారులు పాల్గొన్నారు.