Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
సీఎం కేసీఆర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని ఎంపీపీ ముప్పని ఆశా శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ పందిళ్ళపల్లి పుల్లారావు అన్నారు.శుక్రవారం మండలపరిధిలోని నామవరం పెద్దచెరువులో లక్షా యాబై వైల రొయ్యపిల్లలను వదిలారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకుల పాలనలో మత్స్యకారులు ఉపాధిలేక వలసబాట పట్టే వారిని ఆవేదన వ్యక్తంచేశారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.ప్రభుత్వం చేపపిల్లల పెంపకంతో పాటు వారికి మోపేడు వాహనాలను అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తండు యాదమ్మ, మల్సూర్, జిల్లా అధికారి సౌజన్య, ఎంపీడీఓ శంకర్‌రెడ్డి, మత్స్యకారులు పిట్టల నగేష్, పాండవుల కష్ణ, చింతకాయల రమేష్, అరె నర్సయ్య పాల్గొన్నారు.