Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు
నవతెలంగాణ -ఆలేరురూరల్ .
ప్రభుత్వం రైతుబంధు సంబరాలు నిర్వహించడం కాదు, వారి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు , మంగ నర్సింహులుకోరారు. శుక్రవారం స్థానిక ఏసీరెడ్డి భవనంలో తాళ్లపల్లి గణేశ్ అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ మండల, పట్టణ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించకుండా పంటల మార్పిడి ప్రణాళికలతో రైతులను నష్టాల కొలిమిలో నెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పంపిణీ చేసినందుకు సంబురాలు చేసుకోవాలని పిలుపు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గారికి రైతుల మీద ప్రేమ ఉంటే ఈ ప్రాంతంలో రైతులకు సాగునీరు అందించే గంధమల్ల రిజర్వాయర్ పనులను చేపట్టాలనిడిమాండ్ చేశారు. ఈ నెల 23 నుండి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలకు ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్ , మండల కార్యదర్శి దుప్పటి వెంకటేష్ ,మోరిగాడి రమేష్, నల్ల మాస తులసయ్య ,ఘన గాని మల్లేష్, ఎలుగల శివ ,చెన్న రాజేష్, కాసుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.