Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం పండుగలా మారిందని జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో శుక్రవారం ఆయన పలు అభివద్ధి పనులకు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, ఆరోగ్య ఉపకేంద్రం, పల్లె ప్రకతి వనం, రైతు వేదికల భవనాలను వారు ప్రారంభించారు. అనంతరం బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. అలాగే రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గ్రామంలోని రైతువేదిక వద్ద గ్రామ రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీరు, కరెంటు లేక రైతులు ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బందు పథకం ద్వారా ఎకరానికి 10 వేల రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే వారి కుటుంబానికి భరోసాగా రైతు బీమా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్‌కు ప్రజల అండ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరెేందరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి కొండల్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్, మాజీ ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి, ఎల్లారెడ్డి గూడెం సర్పంచ్ మేడి పుష్ప లత శంకర్, రైతు బంధు మండల అధ్యక్షుడు యానాల అశోక్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కొండూరు శంకర్, వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి, ఎంపీటీసీలు మేకల రాజిరెడ్డి, ముత్తయ్య, శ్రీరామోజు జయ లక్ష్మి, ఉప సర్పంచ్ వడ్డే భూపాల్, నాయకులు బత్తుల అనంతరెడ్డి, అమతరెడ్డి పాల్గొన్నారు