Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన దూడల సరోజనకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కును శుక్రవారం సర్పంచ్ కట్టా సమరసింహారెడ్డి ఎంపీటీసీ జూకంటి అనురాధ అనిల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామన్న, వార్డు సభ్యులు లలిత, ఏసు రుషి ,చింతకింది నర్సింలు, వీఆర్ఏ వడ్డేపల్లి చక్రపాణి , టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఎలగందుల వెంకటేశ్వర్లు, కళ్లెపు రమేష్ , రాజు, నవీన్,పాల్గొన్నారు.
మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో నంగునూరు సంపూర్ణకు శుక్రవారం గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి స్వామి ,పంచాయతీ కార్యదర్శి బుచ్చిరెడ్డి, నాయకులు శంకరయ్య, లక్ష్మీనారాయణ, జలంధర్ ,మధుసూదన్, భాస్కర్, రవి ,నాగార్జున ,క్రాంతి ,ఉపేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.