Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం కోసం రుణాలు
అ పాసుబుక్కులతోనే రైతుల బిడ్డలకు విద్యా రుణాలు
అ టెస్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్రావు
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో ఏర్పాటు అయిన టెస్కాబ్ అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ బ్యాంకుగా నిలిచి ప్రజలకు,ఖాతాదారులకు అండగా ఉందని తెలంగాణ కోపరేటివ్ సొసైటీ చైర్మెన్్ కొండూరు రవీందర్రావు తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్టలో నిర్వహించిన ఆ సంస్థ పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలన విభాగంలో కమర్షియల్ బ్యాంకులకు దీటుగా టెస్కాబ్ను నడుపుతున్నామన్నారు. జిల్లా బ్యాంకులు కూడా ఇలాగే నడవాలని కార్యాచరణతో ప్రతి జిల్లాలోనూ పాలక మండలి సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లా బ్యాంకులోనూ లాభాల్లో ఉన్న కొన్ని నష్టాల్లో ఉన్నందున ఏజీఎం పై స్థాయి అధికారులను బదిలీ చేయాలని పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటి నుండి అమలు జరుపుతమన్నారు. కోవిడ్ సమయంలో కూడా సహకార వ్యవస్థ రైతులకు బ్రహ్మాండమైన సేవలు అందించిందన్నారు. రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఖాతాదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కషి చేస్తామన్నారు. రైతులకు ప్రస్తుతం ఇచ్చే వారి పాసుబుక్కులతోనే వారి పిల్లలు ఉన్నత చదువులకు విద్యా రుణాలను కూడా ఇస్తున్నామన్నారు. సొసైటీ ద్వారా ఇతర కార్యకలాపాలు అందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. నల్లగొండ సొసైటీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతుందని కొనియాడారు. గత ఏడాది రూ.10 కోట్ల లాభాలు అర్జించిందన్నారు. కోపరేటివ్ ఉద్యోగులకు కూడా బ్రహ్మాండమైన పీఆర్సీ ఇచ్చామని తెలిపారు. త్వరలోనే అన్ని బ్యాంకుల్లో నూ మొబైల్ బ్యాంకింగ్ అమలు చేస్తామన్నారు.సొసైటీలను మల్టీ లెవెల్ సిస్టం గా తయారు చేసేందుకు కషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో టెస్కాబ్ వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి,వివిధ జిల్లాల డీసీసీబీచైర్మెన్లు రఘునందన్ రెడ్డి ,మనోహర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి , మార్నేని రవీందర్రావు, టెస్కాబ్ ఎండి నేతి మురళీధర్ ,డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి,మోహన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.