Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-చిట్యాల
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి స్థానికంగా శుక్రవారం ఇంటింటిి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 22 నుంచి 25వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ లో జరిగే సభలను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేసి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ యజమానులకు కారుచౌకగా అమ్ముకొనే పనిలో మునిగిపోయిందని విమర్శించారు. మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్రప్రభుత్వం అవకాశవాద విదానాలు అవలంబించకుండా ప్రజల పక్షాన నికరమైన పోరాటాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, రూరల్ మండల కార్యదర్శి అరూరి శ్రీనివాసు, మండల కమిటీ సభ్యులు నారబోయిన శ్రీనివాస్, రుద్రారం పెద్దలు, అయిత రాజనర్సింహ, కల్లూరి కృష్ణ పాల్గొన్నారు.