Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పత్తికి క్వింటా రూ.10వేలు
అ .50వేల కోట్లతో రైతుబంధు
అ ఊరురా రైతుబంధు విజయోత్సవాలు
అ మంత్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ-యాదాద్రి
తెలంగాణలో వ్యవసాయ రంగంపై చిత్రలేఖనం, వ్యాసం రచనలు చేసే రోజులొచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సిగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవసాయాభివద్ధికి తెలంగాణ ప్రజానికం స్వచ్చంధంగా రైతులు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారని వెల్లడించారు. యాదాద్రి స్వామిని శుక్రవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. పత్తి క్వింటాల్‌కు రూ.9వేల నుండి రూ.10 వేలు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలు అధికంగా అందుబాటులో తెచ్చిన ఘనత టీఆర్ఎస్దే అన్నారు. ఈ పత్తి గత యేడు 61 లక్షల ఎకరాల్లోపత్తివేయగా ఈ యేడు 40 లక్షల ఎకరాలకు పరిమితం కావడం దురదష్టకరమన్నారు. అంతర్జాతీయ డిమాండ్ మేరకు పత్తిని పంపించాలని మంత్రి రైతులను కోరారు. ఇదిలా ఉండగా సాగునీటితో పాటు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుకు ఎదురొచ్చి ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఎనిమిది విడతలలో రూ.50 వేల కోట్లు రైతు బంధు పథకం రాష్ట్రంలో ఒక మైలురాయి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం పిదప తొలి క్యాబినెట్ లో ప్రకటించిన విధంగా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. . పండించిన పంటకు గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే రైతుల నుండి కొనుగోలు చేస్తోందన్నారు. ఇతర వ్యాపారులకు రైతులు అమ్ముకుంటే అధిక ధర వస్తాయనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మొదటి నుంచి చెబుతున్నామని పేర్కొన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా కాళేశ్వరం నీటితో యాదాద్రినరసింహుని కాళ్లు కడిగిన మహనీయుడు కేసీఆరే అన్నారు. మరో రెండు నెలల్లో అద్భుతమైన ఘట్టం ఆవిష్కతం కాబోతోందని చెప్పారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ. మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుదాహేమేందర్ గౌడ్. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నాయకులు మిట్ట వెంకటయ్య, పేరబోయిన సత్యనారాయణ, మిట్ట అనిల్ గౌడ్ తదితరులు ఉన్నారు.
ప్రపంచానికే మార్గదర్శిగా రైతు బంధు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
భువనగిరిరూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకం ప్రపంచానికి ఒక మార్గదర్శిగా మారిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవ సంబురాల్లో ఆయన మాట్లాడారు. ఈ నెల 4 నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న రైతుబంధు వారోత్సవ సంబరాలలో రైతులు పెద్దఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు, కోటీ 45 లక్షల ఎకరాలకు పెట్టుబడి అందించారన్నారు. 92 శాతం ఉన్న ఐదు ఎకరాల లోపు సన్న, చిన్నకారు రైతులకు రైతు బంధు భరోసాగా నిలిచిందన్నారు. రూ. 50 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేసినట్టు తెలిపారు. జిల్లాలో నాలుగేండ్ల నుండి ఎనిమిది సీజన్లలో రైతాంగానికి రూ.1968 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పెట్టుబడి కింద రైతుబంధు ద్వారా రాష్ట్రంలో 50 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, జిల్లాకు సంబంధించి రూ.1968 కోట్లు రైతుబంధు పథకం కింద మంజూరు చేసినట్టు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద వారి ఖాతాలోకి నేరుగా జమ చేయడం పట్ల రైతు లోకం సంతోషంతో సంబరాలు నిర్వహించుకుంటున్నారన్నారు. అనంతరం మంత్రి కాళేశ్వర్వం ప్రాజెక్టును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జె.అమరేందర్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కె.అమరేందర్ గౌడ్, మున్సిపల్ చైర్మెన్ ఆంజనేయులు, జెడ్పీటీసీ బీరు మలయ్య, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మెన్ కిష్టయ్య, ముత్తిరెడ్డిగూడెం సర్పంచ్ మకొల్ సత్యం యాదవ్, ఎంపీటీసీి కష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా సహకార శాఖ అధికారి పరిమళ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రైతు ను రాజు చేసేందుకే రైతు బంధు పథకం : మంత్రి
ఆలేరురూరల్ : రైతును రాజు చేయడానికి రైతుబంధు పథకం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరులోని మల్లికార్జున కాటన్ మిల్లులో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాలో వారు మాట్లాడారు.రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడరు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఏమీ చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి, మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్, వైస్ చైర్మెన్ నాగరాజు, పీఏసీఎస్ చైర్మెన్ మల్లేశం, మున్సిపల్ చైర్మెన్ శంకరయ్య, మార్కెట్ జిల్లా అధికారి సబిత ,ఏడిఏ వెంకటేశ్వర్లు, ఏఓ పద్మజ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీను, టౌన్ ప్రెసిడెంట్ మల్లేశం, గుట్ల చైర్మెన్ సుధా మహేందర్ గౌడ్ ,వైస్ చైర్మెన్ మాధవి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నార