Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ, పబ్లిక్ హెల్త్, నాన్ పబ్లిక్ హెల్త్ కార్మికులకు వేతనాలు పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్, మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ సర్క్యులర్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు డబ్బీకార్ మల్లేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీఓ నెంబర్ 4ను విడుదల చేసిందని, అదే విధంగా సర్క్యులర్లు జారీ చేసిందని తెలిపారు. అన్ని మున్సిపాల్టీల్లో మాదిరిగానే మిర్యాలగూడ లో కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. జూన్ 2021 నుంచి పెంచిన వేతనాలను అమలు చేయాలని, ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన వేతనాలు కార్మికులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కార్మికులకు రెండు జతల యూనిఫాం, కొబ్బరి నూనె, సబ్బులు అందజేయాలని , చేతి గ్లౌజులు ఇవ్వాలని కోరారు. వారంలో ఒకరోజు కార్మికులకు సెలవు వచ్చేలా షిఫ్టు డ్యూటీలు వేయాలని సూచించారు. అనంతరం కార్మికుల సమస్యలపై చైర్మన్ భార్గవ్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు తిరుపతి రామ్మూర్తి, వీరేపల్లి వెంకటేశులు, నాయకులు బవాండ్ల పాండు, డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, మున్సిపల్ కార్మికులు సీహెచ్.వెంకన్న, డి.మోహన్, సంపత్, వెంకన్న, వెంకటేశ్వర్లు, ఎస్.మోహన్‌కష్ణ, మల్లేష్, కళావతి, నాగమణి, వెంకటమ్మ లింగయ్య పాల్గొన్నారు.